వరంగల్: వాహనంతో పాటు వచ్చే సైలెన్సర్లను నిబంధనలకు విరుద్ధంగా మార్చి అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్ల అమరుస్తున్నారు కొందరు వాహనదారులు. చెవులకు చిల్లులు పడేలా శబ్ధం వచ్చే ఈ మోడిఫై సైలెన్సర్ల వల్ల రోజు రోజుకీ వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఎయిర్ పొల్యూషన్‌తో పాటు వాహనదారులు, ప్రయాణికులు ఈ సైలెన్సర్ల భారీ సౌండ్లకు అసౌకర్యానికి గురి అవుతున్నారు. ఈ మోడీఫై సైలెన్సర్ల సౌండ్ వల్ల కొందరు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా బండ్ల సెలైన్సర్లు మారుస్తున్నా వారిపై వరంగల్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝలిపించారు. మంగళవారం (డిసెంబర్ 10) హనుమకొండలోని అథాలత్ జంక్షన్ వద్ద అధిక శబ్ధం చేసే ద్విచక్రవాహన సైలెన్సర్లను రోడ్ రోలర్‌తో ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వాహనదారులు, మెకానిక్‌లకు వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ కీలక సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు బండ్లకు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేయకూడదని సూచించారు.
Also Read :- రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి
ట్రాఫిక్ నిబంధనలు విరుద్ధంగా సైలెన్సర్లు మారిస్తే వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్‌పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఏడాది జనవరి నుంచి వరంగల్ ట్రైసిటీలో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి 1122 సైలెన్సర్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శబ్ధకాలుష్యానికి పాల్పడేలా బైక్‌లు నడిపే వారితోపాటు... మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాళ్ల తల్లిదండ్రులపైనా చర్చలు తప్పవని హెచ్చరించారు.