హెల్మెట్ ‌‌పెట్టుకోపోతే రూ.235, రాంగ్​రూట్​లో వెళ్తే రూ.2వేలు 

హెల్మెట్ ‌‌పెట్టుకోపోతే రూ.235, రాంగ్​రూట్​లో వెళ్తే రూ.2వేలు 
  • స్పెషల్ డ్రైవ్స్ కు సిద్ధమవుతున్న ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్ ‌‌, వెలుగు : రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. హెల్మెట్ ‌‌ లేకుండా డ్రైవ్ ‌‌ చేస్తే ఇక నుంచి రూ.200, రాంగ్ సైడ్ ‌‌ డ్రైవింగ్ ‌‌ చేస్తే రూ.2వేలు జరిమానా విధించాలని నిర్ణయించారు. జరిమానాతోపాటు రూ.35 సర్వీస్​చార్జ్​వసూలు చేయనున్నారు. స్పాట్ చలాన్స్ ‌‌లో మాత్రం సర్వీస్​చార్జ్​మినహాయిస్తారు.

ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ ‌‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మోటార్ వెహికల్ యాక్ట్ ‌‌ ప్రకారం మ్యాగ్జిమం జరిమానాలు విధిస్తామని తెలిపారు. స్పెషల్ ‌‌ డ్రైవ్స్​నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఇదే క్రమంలో పెండింగ్ ‌‌ చలాన్స్ ‌‌ క్లియర్ ‌‌ చేయనున్నారు. 

సర్వీస్ ‌‌చార్జితో రూ.235

ఇప్పటికే ట్రై కమిషనరేట్ల పరిధిలో హెల్మెట్ ‌‌ రూల్ ‌‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలు, ట్రాఫిక్ పోలీసుల డిజిటల్ కెమెరాలతో(నాన్ ‌‌ కాంటాక్ట్ ‌‌) చలాన్స్ ‌‌ జనరేట్ ‌‌ చేస్తున్నారు. హెల్మెట్ ‌‌ పెట్టుకోని వారికి గతంలో రూ.35 సర్వీస్​చార్జితో కలిపి రూ.135 జరిమానా వేసేవారు. పెంచిన చార్జీలతో ఆ మొత్తాన్ని రూ.235కు చేరనుంది.

స్పాట్ ‌‌(కాంటాక్ట్ ‌‌) చలాన్స్ ‌‌లో 200 జరిమానా మాత్రమే విధిస్తారు. మొన్నటి దాకా రాంగ్ సైడ్ డ్రైవింగ్ ‌‌పై స్పాట్ ‌‌ చలాన్స్ ‌‌తో పాటు కేసులు నమోదు చేసేవారు. రూ.1000 జరిమానా విధించేవారు. చార్జిషీట్ ‌‌ దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచేవారు. ఇక నుంచి రాంగ్ ‌‌ సైడ్ ‌‌ డ్రైవింగ్ ‌‌కు రూ.2వేలు జరిమానా విధించనున్నారు.