వరంగల్ లో ట్రాఫిక్​ స్పెషల్​ డ్రైవ్

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్​ సిటీలో మంగళవారం ట్రాఫిక్​ పోలీస్​లు స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకన్న మాట్లాడుతూ పోలీస్​ కమిషనర్​తో పాటు ఏసీపీ సూచనల మేరకు గ్రేటర్​ వరంగల్​లో తనిఖీలు చేశామన్నారు. 18మందికి రూ.18.300లు జరిమానా, ఇద్దరికి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్టు చెప్పారు. ప్రతి వాహనదారుడు తప్పుని సరిగా డ్రైవింగ్​ లైసెన్స్​ కలిగి ఉండాలన్నారు.