పెద్దపల్లి జిల్లా లో రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహదారిపై ట్రాఫిక్​ కష్టాలు

పెద్దపల్లి జిల్లా లో రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహదారిపై ట్రాఫిక్​ కష్టాలు
  • పెద్దపల్లి జిల్లాకేంద్రంగా మారాక పెరిగిన రద్దీ 
  • పట్టణంలో పార్కింగ్​ స్థలాలు లేక వాహనదారుల పరేషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ​ 
  • అస్తవ్యస్తంగా ట్రాఫిక్​ సిగ్నల్స్​
  • రోజూ ఏదోచోట ప్రమాదాలు 
  • బైపాస్​ నిర్మించాలని పట్టణవాసుల డిమాండ్​ 

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రహదారి టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడిబొడ్డు నుంచే వెళ్తుండడంతో దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలతో రద్దీ పెరుగుతోంది. పెద్దపల్లి జిల్లాకేంద్రంగా మారాక ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెట్టింపయింది. టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సరైన పార్కింగ్​ స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే నిలపాల్సిన పరిస్థితి. దీంతో రోడ్లు ఇరుగ్గా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాజీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైవేపై  రద్దీ పెరగడంతో పెద్దపల్లి టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బైపాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించాలని పట్టణవాసులు డిమాండ్​ చేస్తున్నారు.  మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు పట్టణంలో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

ఉదయం 10 గంటలైతే రోడ్లు బిజీ 

పెద్దపల్లి జిల్లాగా మారిన తర్వాత ట్రాఫిక్​ పెరిగిపోయింది. పెద్దపల్లి పట్టణం నడిబొడ్డు నుంచే రాజీవ్ రహదారి వెళ్తుండడంతో రద్దీతో పాటు రోజూ ఏదోచోట ప్రమాదం జరుతుంది. ఈ రహదారి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బిజీగా ఉంటుంది.  హైవే పక్కన ఉన్న వ్యాపార  సముదాయాల ఎదుట పార్కింగ్​ స్థలాలు లేకపోవడంతో వాహనదారులు తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్​ చేస్తున్నారు.  అలాగే పెద్దపల్లి పట్టణంలో ట్రాఫిక్​ సిగ్నల్స్​ ఏర్పాటు కూడా సక్రమంగా లేదనే విమర్శలున్నాయి. 

100 మీటర్ల దూరంలోనే అయ్యప్ప టెంపుల్​, బస్టాండ్​ సమీపంలో సిగ్నల్స్​ ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. షాపింగ్​ సెంటర్ల ముందు ఎలాంటి పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లేవు, కనీసం సెల్లార్లు కూడా లేవు. సెల్లార్లు లేకుండా బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. షాపుల ముందు పుట్​పాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఆక్రమించుకొని వస్తువులు, బోర్డులను పెట్టుకుంటున్నారు. పట్టణంలో రాజీవ్​ రహదారిని ఆనుకొని ఇరువైపులా అక్కడక్కడా  మద్యం షాపులు, బార్లు ఉన్నాయి. మందు తాగేందుకు వచ్చేవారు గంటల తరబడి షాపుల ముందు తమ వాహనాలను పార్క్​ చేసి ఉంచుతున్నారు. 

బైపాస్​కు డిమాండ్​..

పెద్దపల్లి పట్టణానికి బైపాస్​ నిర్మించాలని డిమాండ్​ పెరిగిపోయింది.  పెద్దపల్లి జిల్లాగా ఏర్పాటైన తర్వాత బైపాస్​, రింగ్​ రోడ్డు నిర్మాణాల చర్చ తెరమీదకు వచ్చింది. పెద్దపల్లి మండలం పెద్దకల్వల నుంచి చందపల్లి మీదుగా అప్పన్నపేట వరకు, పెద్దకల్వల నుంచి హన్మంతునిపేట మీదుగా అప్పన్నపేట వరకు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేశారు. కానీ అది ఇప్పటివరకు ఆచరణలోకి రాలేదు. 

కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్​ సర్కార్​లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు బైపాస్​ నిర్మాణాన్ని సీరియస్​గా తీసుకున్నట్లు కన్పిస్తుంది. ఇటీవల ఆర్​అండ్​బీ అధికారుల, రెవెన్యూ అధికారులతో కలిసి బైపాస్​ రోడ్డు నిర్మాణ స్థలాలను పరిశీలించారు. పెద్దపల్లి పట్టణానికి బైపాస్​ నిర్మిస్తే 90 శాతం ట్రాఫిక్​ సమస్య తీరుతుంది.

పెయిడ్​ పార్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు  ఏర్పాటు చేయాలే

పట్టణాల్లో పెరిగినపోయిన ట్రాఫిక్​ సమస్యను పరిష్కరించడానికి మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పెయిడ్​ పార్కింగ్​లు  ఏర్పాటు చేయాలని పట్టణవాసులు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు.  కార్ల  కోసం జూనియర్​ కాలేజీ ముందు పార్కింగ్​ ఏర్పాటు చేసినట్లు ఆటోలకు కూడా పార్కింగ్​ ఏర్పాటు చేయాలి. ప్రధాన కూడళ్ల వద్ద పెయిడ్​ పార్కింగ్​లు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్​ సమస్య  తీరుతుందని వాహనదారులు అంటున్నారు.