
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు మంగళవారం (ఏప్రిల్ 22) ప్రకటించారు.హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 25 వరకు ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు.
GHMC 'T' జంక్షన్ నుంచిBRKR భవన్ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. GHMC 'T' జంక్షన్ దగ్గర రోడ్డు మూసివేస్తారు. లిబర్టీ ,బషీర్‌బాగ్ వైపు నుంచిBRKR లేన్ ద్వారా తెలుగు తల్లి జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను GHMC 'T' జంక్షన్ దగ్గర అంబేద్కర్ విగ్రహం వైపు మళ్లిస్తారు.ప్రయాణికులు పైన పేర్కొన్న ట్రాఫిక్ మళ్లింపును గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరింది.
ఏప్రిల్ 23న GHMC ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 25న కౌంటింగ్ ఉంటుంది.
►ALSO READ | టీచర్ అయితే ఎవరికి గొప్పే.. : టీచర్ ను కాలేజీలోనే చెప్పుతో కొట్టిన స్టూడెంట్