- మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 వరకు అమలు
హైదరాబాద్, వెలుగు: ఎల్బీ స్టేడియంలో డీఎస్‌సీ అభ్యర్థులకు బుధవారం నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, సహా మంత్రులు, వీఐపీలు, 11 వేల మంది డీఎస్సీ అభ్యర్థులు పాల్గొననున్న నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సిటీ ట్రాఫిక్చీఫ్విశ్వప్రసాద్తెలిపారు.
ఏఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బీజేఆర్‌విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి స్టేషన్ రోడ్ లోకి, బషీర్‌బాగ్ నుంచి ఏఆర్ పెట్రోల్ బంక్ వైపు వెళ్లే వాహనాలను గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్ మీదుగా, సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు డైవర్ట్ చేస్తారు.
హైదరాబాద్ జిల్లాలో 616 మందికి నియామక పత్రాలు
హైదరాబాద్ జిల్లాలో ఎంపికైన 616 మంది డీఎస్సీ అభ్యర్థులు బుధవారం ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. జిల్లాలోని 878 పోస్టులుండా, 262 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్‌లో పడింది.
ఉర్దూ మీడియంలో రిజర్వేషన్ కేటగిరిలో అభ్యర్థులు లేకపోవడంతో పోస్టులు పెండింగ్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇన్ సర్వీస్‌లో ఉండి సెలవులు పెట్టకుండానే బీఈడీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న8 మంది ఎంపిక పెండింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.