అలర్ట్: హైదరాబాద్లో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు..ఎక్కడెక్కడంటే?

అలర్ట్:  హైదరాబాద్లో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు..ఎక్కడెక్కడంటే?

హైదరాబాద్   పాతబస్తీలోని లాల్ దర్వాజ్ బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు.సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారు జామున అమ్మవారికి బలిహరణం, దేవీ అభిషేకం తర్వాత భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. ఆలయాలన్నీ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి.

ట్రాఫిక్ ఆంక్షలు 

జూలై 28,29న నిర్వహించే పాతబస్తీ సింహవాహిని మహంకాళీ బోనాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. బోనాల సందర్భంగా ఛత్రినాక ప్రాంతంలో, లాల్ దర్వాజా సింహవాహినీ శ్రీమహాకాళి అమ్మవారి ఆళయం దగ్గర నుంచి అక్కన్న మాదన్న టెంపుల్ వరకు ఏనుగుపై ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు భక్తులు. మహిళలు బోనాలను తలపై పెట్టుకొని మేళ తాలులు, డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి తీసుకెళ్లి బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. 

బోనాల నేపథ్యంలో ఫలక్ నుమా, చార్మినార్, మీర్ చౌక్, బహదూర్ పురా, పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో.. నయాపూల్ నుంచి అక్కన్న మాదన్న టెంపుల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు పోలీసులు.  సింహవాహిని శ్రీ మహాంకాళి లాల్ దర్వాజా టెంపుల్ రోడ్ వైపు నెహ్రూ విగ్రహం లాల్ దర్వాదా నుంచి ట్రాఫిక్ అనుమతించడం లేదు. హిమ్మత్ పూరా, షంషీర్ గంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను నాగుల చింత, గౌలిపురా వైపు మళ్లించారు. చాంద్రాయణగుట్ట, కందికల్ గేట్, ఉప్పుగూడ వైపు నుంచి వచ్చే వెహికిల్స్ ను లాల్ దర్వాజా వైపు అనుమతించడం లేదు పోలీసులు. ఛత్రినాక ఔట్ పోస్ట్ దగ్గర గౌలిపుర, నాగుల చింత వైపు వాహనాలను మళ్లిస్తున్నారు.