హైదరాబాద్‌లో ఇవాళ (జనవరి26) ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌లో ఇవాళ (జనవరి26)  ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్, వెలుగు: రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ తో పాటు రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లింపు చేయనున్నారు. ఈ మేరకు అడిషనల్ సీపీ(ట్రాఫిక్) విశ్వప్రసాద్ శనివారం నోటీఫికేషన్ విడుదల చేశారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు, పంజాగుట్ట నుంచి బేగంపేట మీదుగా సికింద్రాబాద్ వెళ్లే రూట్ లో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

వీఐపీల మూవ్మెంట్ సమయాల్లో ట్రాఫిక్ నిలిపివేత, దారి మళ్లింపు ఉంటుందన్నారు. వాహనదారులు నిర్ధేశించిన రూట్లలో ట్రావెల్ చేయాలని సూచించారు. ఎట్ హోమ్ సందర్భంగా రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, పంజాగుట్ట, బేగంపేట మార్గాల్లో అవసరానికి అనుగుణంగా వాహనాల నిలిపివేత మళ్లింపులు ఉంటాయని పేర్కొన్నారు.