హైదరాబాద్ సిటీలో గణేస్ చతుర్థి పురస్కరించుకొని గల్లీగల్ళీకో గణేషులు కొలువు దీరారు. హైదరాబాద్ ఫేమస్ గణేషుడు ఖైరతాబాద్ బడాగణపతికి తొలిపూజ నిర్వ హించారు నిర్వాహకులు.తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ బడా గణేషుని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకునేందుకు సిటీతో పాటు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివస్తున్నారు..ఈ క్రమంలో ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని రూట్లలో ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.
ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు.. ట్యాంక్ బండ్ సమీపంలోని ఐమాక్స్ వద్ద వాహనాలు నిలిపి వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలోని రైల్వేగేటు నుంచి వాహనాలకు అనుమతి లేదు.. నడుచుకుంటే వెళ్లే భక్తులను మాత్రమే అనుమతిస్తున్నారు.
ALSO READ | ఖైరతాబాద్ గణేషుని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వారు వాహనాలను ఐమాక్స్ పక్కన ఉన్న పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలిపి.. బడా గణేషుని దర్శనానికి రావాల్సి ఉంటుంది. ఐమాక్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు.
అదేవిధంగా మింట్ కాంపౌండ్ నుంచి వచ్చే భక్తులు వాహనాలను కారు రేసింగ్ ప్రాంతంలో పార్కింగ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఖైరతాబాద్ mmts రైల్వే స్టేషన్ వద్ద కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేసిన తెలిపారు. రోడ్లపై వాహనాలను నిలిపి ట్రాఫిక్ కి ఇబ్బందులు కలిగించొద్దని వాహనదారులకు సూచించారు.