హైదరాబాద్‌లో సెప్టెంబర్ 14న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్తే బెస్ట్

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 14న ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్తే బెస్ట్

హైదరాబాద్‌: సైబర్‌ టవర్స్‌ నుంచి యశోద హాస్పిటల్స్‌ వరకు రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. దీంతో ఆ రూట్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సెప్టెంబర్‌ 13 శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. సైబర్ టవర్స్, 100 ఫీట్ జంక్షన్, కొత్తగూడ నుంచి జేఎన్‌టీయూ, మూసాపేట్ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ లేకుండా వెళ్లాలంటే వేరే రూట్లో వెళ్లాలని సూచించారు.

టోడీ కాంపౌండ్ నుంచి 100 ఫీట్ జంక్షన్ మీదుగా JNTU మరియు మూసాపేట్ వైపు వెళ్లే ట్రాఫిక్ పర్వతనగర్ జంక్షన్ దగ్గర టర్న్ తీసుకొని ఖైత్లాపూర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్లాలని చెప్పారు. 

IKEA, సైబర్ గేట్‌వే మరియు COD జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ మీదుగా JNTU వైపు వెళ్లే ప్రయాణికులు నేరుగా JNTU వైపు వెళ్లాలని తెలిపారు.

JNTU వైపు సైబర్ టవర్స్ ఫ్లైఓవర్ కింద ప్రయాణించే ట్రాఫిక్ N -గ్రాండ్ హోటల్ దగ్గర వాహనాలు మళ్లిస్తారు. N- కన్వెన్షన్ మీదుగా వెళ్లి, జైన్ ఎన్‌క్లేవ్ దగ్గర రైట్ టర్న్ తీసుకుంటారు. JNTU వైపు ROB ఫ్లైఓవర్‌లో విలీనం చేయడానికి యశోద హాస్పిటల్ వెనుక రోడ్డలో వెళ్లాలి.