ఇవాళ (ఏప్రిల్ 6) శ్రీరామ శోభాయాత్ర .. సీతారాంబాగ్​ నుంచి హనుమాన్​ వ్యాయామశాల వరకు ట్రాఫిక్​ ఆంక్షలు

ఇవాళ (ఏప్రిల్ 6) శ్రీరామ శోభాయాత్ర .. సీతారాంబాగ్​ నుంచి హనుమాన్​ వ్యాయామశాల వరకు ట్రాఫిక్​ ఆంక్షలు
  • ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు అమలు 
  • ఆల్టర్నేట్​రూట్లలో జర్నీ చేయాలని వాహనదారులకు పోలీసుల సూచన    

హైదరాబాద్ సిటీ, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా సిటీలో నిర్వహిస్తున్న శోభాయాత్రకు పోలీసులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సీతారాంబాగ్​నుంచి మొదలై హనుమాన్​వ్యాయమశాల వద్ద శోభాయాత్ర ముగుస్తుందని తెలిపారు. ఆ రూట్​లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వెహికల్స్​డైవర్షన్​ఉంటుందని వెల్లడించారు. బోయిగూడ కమాన్, మంగళ్​హాట్​పీఎస్​రోడ్, ధూల్​పేట, పురాణపూల్, గాంధీ స్టాచ్యూ, జుమెరాత్​బజార్, చుడీ బజార్, బేగం బజార్, శంకర్​శేర్​హోటల్,  గౌలిగూడ కమాన్, రామమందిర్ కమాన్, పుత్లీ బౌలి క్రాస్​ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్​ క్రాస్​ రోడ్, సుల్తాన్​ బజార్, రాయల్​ప్లాజ్ మీదుగా శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. 

ప్రధాన జంక్షన్లు అయిన బేగంబజార్​ఛత్రీ, ఎస్ఏ బజార్, అఫ్జల్​గంజ్​టి జంక్షన్, శివాజీ బ్రిడ్జి జంక్షన్, సీబీఎస్​ ఓ జంక్షన్, పుత్లీబౌలి క్రాస్​ రోడ్,  కోఠి ఆంధ్రా బ్యాంక్, జీపీఓ అబిడ్స్, ఎంజే మార్కెట్, కాచిగూడ క్రాస్​ రోడ్, నింబోలి అడ్డా జంక్షన్లలో డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. ఏదైనా ట్రాఫిక్​ సమస్య ఎదురైతే  90102 03626 హెల్ప్​లైన్​కు కాల్​చేయాలని ట్రాఫిక్​పోలీసులు కోరారు.