హైదరాబాద్ డిసెంబర్ 17 నుండి 21 వరకు ట్రాఫిక్ ​ఆంక్షలు

హైదరాబాద్ డిసెంబర్ 17 నుండి 21 వరకు ట్రాఫిక్ ​ఆంక్షలు

సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం మంగళవారం సిటీకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల17 నుంచి 21వరకు సిటీలోని పలు ప్రాంతాలో ట్రాఫిక్​ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్​ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్​తెలిపారు. ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు.

మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య హకీంపేట ఎయిర్​పోర్టు, బొల్లారం చెక్​పోస్ట్, యాప్రాల్​రోడ్, అమ్ముగూడ, లోతుకుంట, టివోలి జంక్షన్, రసూల్​పురా, బేగంపేట ఫ్లైఓవర్, పంజాగుట్ట, యశోద ఆసుపత్రి, రాజ్​భవన్ మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు అమలులో ఉంటాయని అడిషనల్​సీపీ తెలిపారు. 20, 21 తేదీల్లో అమ్ముగూడ, లోతుకుంట, తిరుమలగిరి, బేగంపేట, పంజాగుట్ట ప్రాంతాల్లో ట్రాఫిక్​ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు.