జూన్ 2న హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు ఇవే

జూన్ 2న  హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు ఇవే
  •  ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా..  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం రాత్రి వేడుకలు ముగిసేంత వరకు ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. ఈ మేరకు సీపీ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఆవిర్భావ వేడుకలు ముగిసేంత వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సాధారణ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌కు అనుమతి లేదని తెలిపారు. 

వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. కట్టమైసమ్మ, ఓల్డ్‌‌‌‌‌‌‌‌ అంబేద్కర్ విగ్రహం, తెలుగుతల్లి జంక్షన్‌‌‌‌‌‌‌‌, లిబర్టీ, ఇక్బాల్‌‌‌‌‌‌‌‌ మినార్, ఇందిరాగాంధీ రోటరీ, వీవీ విగ్రహం, కర్బలా, ఓల్డ్‌‌‌‌‌‌‌‌ సైఫాబాద్‌‌‌‌‌‌‌‌, రవీంద్రభారతి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయిని చెప్పారు. అప్పర్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌ మీదుగా ఎలాంటి వాహనాలకు అనుమతి లేదన్నారు. ఆర్టీసీ బస్సులు లోయర్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌ నుంచే వెళ్లాలని సూచించారు.

ట్రాఫిక్ డైవర్షన్స్‌‌‌‌‌‌‌‌ ఉండే ప్రాంతాలివీ..  

  •     నల్లగుట్ట టీ జంక్షన్‌‌‌‌‌‌‌‌ నుంచి మినిస్టర్ రోడ్‌‌‌‌‌‌‌‌, నెక్లెస్ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. రాణిగంజ్‌‌‌‌‌‌‌‌ జంక్షన్ మీదుగా దారి మళ్లిస్తారు.
  •     రాణిగంజ్‌‌‌‌‌‌‌‌ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను మినిస్టర్ రోడ్‌‌‌‌‌‌‌‌ మీదుగా మళ్లిస్తారు. 
  •     వీవీ విగ్రహం వైపు నుంచి తెలుగుతల్లి వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ వద్ద నల్లగుట్ట వైపు మళ్లిస్తారు.
  •     ఓల్డ్‌‌‌‌‌‌‌‌ సైఫాబాద్ పీఎస్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇక్బాల్‌‌‌‌‌‌‌‌ మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు వచ్చే ట్రాఫిక్​ను రవీంద్రభారతి సైడ్​ మళ్లిస్తారు.
  •     ఇక్బాల్ మినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌ వైపు నో ఎంట్రీ. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద స్టీల్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జ్‌‌‌‌‌‌‌‌ వైపు మళ్లిస్తారు.
  •     బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌, లిబర్టీ వైపు నుంచి అంబేద్కర్ విగ్రహం, అప్పర్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. హిమాయత్‌‌‌‌‌‌‌‌నగర్ మీదుగా డైవర్ట్ చేస్తారు.
  •     అజామాబాద్‌‌‌‌‌‌‌‌ క్రాస్ రోడ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి స్టీల్ బ్రిడ్జి మీదుగా కట్ట మైసమ్మ రూట్‌‌‌‌‌‌‌‌లో వచ్చే ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ను వీఎస్‌‌‌‌‌‌‌‌టీ వద్ద డైవర్ట్ చేస్తారు.
  •     ఇందిరాపార్క్ క్రాస్ రోడ్స్‌‌‌‌‌‌‌‌ వైపు నుంచి వచ్చే వాహనాలను అశోక్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏవీ కాలేజ్ రోడ్‌‌‌‌‌‌‌‌ నుంచి దారి మళ్లిస్తారు.
  •     కవాడిగూడ క్రాస్ రోడ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి అప్పర్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌కు అనుమతి లేదు. బైబిల్ హౌస్‌‌‌‌‌‌‌‌, డీబీఆర్ మిల్స్‌‌‌‌‌‌‌‌ మీదుగా ట్రావెల్ చేయాలి.