
హైదరాబాద్, వెలుగు: మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్స్‌సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో శనివారం 5కె రన్ నిర్వహిస్తున్నారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి రన్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సిటీ ట్రాఫిక్ సీపీ జోయల్ డెవిస్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
ట్రాఫిక్ డైవర్షన్స్ ప్రాంతాలు
ట్యాంక్ బండ్, మినిస్టర్ రోడ్స్ నుంచి పీవీఎన్‌ఆర్ మార్గ్ మీదుగా వెళ్లాల్సిన వెహికల్స్‌ను బుద్ధభవన్, నల్లగుట్ట క్రాస్ రోడ్ వద్ద కర్బాల మైదాన్, రాణిగంజ్‌వైపు మళ్లిస్తారు. పంజాగుట్ట, రాజ్‌భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ, వీవీ విగ్రహం వద్ద షాదాన్ కాలేజీ, నిరంకారీ రూట్లలో డైవర్ట్ చేస్తారు. అంబేద్కర్ విగ్రహం, ఇక్బాల్ మినార్ వైపు నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్, సెక్రటేరియట్‌నార్త్‌ఈస్ట్ గేట్ వద్ద ఇక్బాల్ మినార్, అప్పర్ ట్యాంక్‌బండ్, మింట్ కాంపౌండ్ లేన్ మీదుగా మళ్లిస్తారు.