అశ్వాపురం వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు మంగళవారం ఉదయం 51 అడుగులకు చేరడంతో అశ్వాపురం మండలంలోని ఆ నది పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. అమ్మగారిపల్లి, ఆనందపురం, నెల్లిపాక పంచాయతీల పరిధిలోని నదీ పరివాహక వాగులన్నీ వరదతో పోటెత్తాయి.
బట్ట మల్లయ్య గుంపు, రాంనగర్ మధ్య, రామచంద్రపురం. ఎర్రబెల్లి గ్రామాల మధ్య రోడ్డుపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు పలుచోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.