రైల్లో అక్రమంగా చిన్నారుల తరలింపు..

సికింద్రాబాద్, వెలుగు: బాల కార్మికులుగా మార్చేందుకు సిటీకి తీసుకువస్తున్న 26 మంది చిన్నారులను రైల్వే పోలీసులు కాపాడారు. వారిని తరలిస్తున్న 8 మందిని అరెస్ట్ చేశారు. ఓ ముఠా వెస్ట్​బెంగాల్, జార్ఖండ్​ రాష్ట్రాల్లోని నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి డబ్బు ఆశ చూపి, వారి పిల్లలను  బాలకార్మికులుగా మార్చేందుకు ప్లాన్ ​వేసింది.

ఆయా రాష్ట్రాల నుంచి ఈస్ట్​ కోస్ట్​ ఎక్స్​ప్రెస్​లో పిల్లలను నగరానికి తరలిస్తుండగా.. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు వచ్చిన ఆ రైలులో సికింద్రాబాద్ విమెన్ ​సేఫ్టీ వింగ్​అధికారులు, చైల్డ్ ​ప్రొటెక్షన్, చైల్డ్ ​వెల్ఫేర్ ​కమిటీ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. 26 మంది పిల్లలను కాపాడి, వారిని తరలిస్తున్న 8 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఆ పిల్లలను రెస్క్యూ హోంకు తరలించారు.