
సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. విధులు ముగించుకుని రాంబాబు అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
సోమవారం(ఏప్రిల్ 21) సాయంత్రం డ్యూటీ పూర్తి చేసుకుని మునగాల వెళ్తుండగా ముకుందపురం దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొనఊపిరితో ఉన్న రాంబాబు కు సీపీఆర్ నిర్వహించారు పోలీసులు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.