ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయ రాజా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయని భవతరిణి(47) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతు్న ఆమె గురువారం( జనవరి 25) న తుది శ్వాస విడిచారు.
లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న భవతరణికి శ్రీలంకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఆమె పరిస్థితి విషమించడంతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. భవతరణి భౌతిక కాయాన్ని రేపటిలోగా (శుక్రవారం ) చెన్నైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. చెన్నైలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇళయరాజా కూతురు మరణవార్త తెలిసి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
భవతరిణికి కోలీవుడ్ లో గాయనిగా మంచి గుర్తింపు ఉంది. 2000 సంవత్సరంలో వచ్చిన భారతి అనే సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించగా.. భవతరిణి మాయిల్ పోలా పొన్ను ఒన్ను అనే పాటను పాడారు. ఈ పాటకు భవతరిణికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. భవతరణి పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పనిచేసింది. చివరిగా 2019లో మాయానది అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు భవతరణి.