కేసీఆర్ ఇంట్లో విషాదం.. సోదరి కన్నుమూత

కేసీఆర్ ఇంట్లో విషాదం.. సోదరి కన్నుమూత

మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి సకలమ్మ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి కన్నుమూశారు. సకలమ్మ కేసీఆర్ కు 5వ సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని పెదిర గ్రామం. ఆమె భర్త హనుమంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. 

సకలమ్మ మరణ వార్త విని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. సోదరి సకలమ్మ మరణ వార్త విని కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.