- సామల వేణు ఆధ్వర్యంలో ఘనంగా యువజన దినోత్సవం
- చీఫ్‌గెస్ట్ గా గాంధీ మునిమనవడు తుషార్‌గాంధీ
పద్మారావునగర్, వెలుగు : స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని, ఆయన చూపిన మార్గంలో యువత నడవాలని మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ పిలుపునిచ్చారు. జాతీయ యువజన అవార్డు గ్రహీత సామల వేణు ఆధ్వర్యంలో ట్యాంక్బండ్వద్ద వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
కార్యక్రమానికి తుషార్ గాంధీ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. తుషార్ గాంధీ మాట్లాడుతూ స్వామి వివేకానంద దేశ విదేశాల్లో పర్యటించి ఎన్నో ప్రసంగాలతో యువతలో చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు. మహాత్మా గాంధీ కూడా స్వామి వివేకానందను ఎంతో అభిమానించేవారిని తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్యూత్సర్వీసెస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వెలుగు, నెట్వర్క్: ట్యాంక్ బండ్ పై ఉన్న వివేకానంద విగ్రహానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దత్తాత్రేయ కూతురు బండారి విజయలక్ష్మి, బీజేపీ సీనియర్ లీడర్ వెంకటేశ్, మహేందర్ బాబు, పర్మిల్ కుమార్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ గాంధీ దవాఖాన మెయిన్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి డాక్టర్లు, సిబ్బంది నివాళులర్పించారు.
పద్మారావునగర్‌లో స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నిర్వాహకులు సంజీవ్ కుమార్, పావని, సభ్యులు పాల్గొన్నారు . రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వివేకానంద జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్‌తోపాటు 30 మంది యువకులు రక్తదానం చేశారు.