మేడ్చల్ జిల్లా పీర్జాదీగూడ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో స్టూడెంట్ సూసైడ్ కలకలం రేపింది. నాగర్ కర్నూల్ జిల్లా చెంచుగూడ గ్రామానికి చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నిమ్మల రమాదేవి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులకు తెలియకుండానే విద్యార్థిని మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. యాజమాన్యం తీరుపై విద్యార్థిని తల్లిదండ్రులు సహా విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరు వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.