రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ సిద్ధాంతి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఇది ప్రమాదామా..? లేక ఎవరైనా ఢీకొట్టి చంపేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో 42 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష స్వీకరిస్తున్న బాబు గురుస్వామి అనే వ్యక్తి మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రాత్రి వినాయక నిమజ్జనంలో పాల్గొని తిరిగి ఉదయం ఇంటికి వెళ్తున్నారు బాబు గురుస్వామి. మల్లికా కన్వెన్షన్ వద్దకు చేరుకోగానే డివైడర్ పై పడిపోయి విగతజీవిగా కనిపించాడు.
ఇది చూసిన కొంతమంది వ్యక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాబు గురుస్వామి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు పోలీసులు. బాబు గురుస్వామి రోడ్డు ప్రమాదంలో చనిపోయారా..? లేక ఎవరైనా ఏమైనా చేశారా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. బాబు గురుస్వామి బైక్ ఒక దగ్గర... అతడి డెడ్ బాడీ మరో దగ్గర ఉంది. దీంతో రెండిటికీ మధ్య దూరం వల్లనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తోటి అయ్యప్ప మాలదారులు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు బయటకు వస్తాయని చెబుతున్నారు పోలీసులు.