
సదాశివపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పండగ పూట విషాదం నెలకొంది. సీఐ మహేశ్తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని వికారాబాద్ రోడ్డులో ఉన్న సెయింట్అంథోని స్కూల్గేటు ముందు ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సు కింద శుక్రవారం హైదరాబాద్ సూరారం కాలనీ, తిరుమలగిరికి చెందిన షేక్ఖాదిర్( 34) పడుకున్నాడు.
అతడు పడుకున్నది బస్సు డ్రైవర్ గమనించకుండా బస్సును తీయడంతో సదరు వ్యక్తి తలపై నుంచి టైర్ వెళ్లి అక్కడికక్కడే చనిపోయాడు. మృతి చెందిన వ్యక్తి జేబులో ఆధార్ కార్డు మాత్రమే ఉందని, హైదరాబాద్ నుంచి సదాశివపేటకు ఎందుకు వచ్చాడన్నది దర్యాప్తులో తెలుస్తుందన్నారు. కేసు నమోదు చేసుకొని డెడ్‌బాడీని గవర్నమెంట్హాస్పిటల్కు తరలించామని సీఐ తెలిపారు.