
శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో జరిగిన ఓదెల రైల్వే స్టేషన్ పార్ట్-2 షూటింగ్లో విషాద ఘటన జరిగింది. శంకర్ పల్లి బీజేపీ నాయకుడు బద్దం శాంబా రెడ్డి ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్తో చనిపోయాడు. శాంబా రెడ్డి మృతిపై కుటుంబసభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.
శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టంగటూరు గ్రామం వద్ద అర్ధరాత్రి గ్రామ బీజేపీ లీడర్ బద్దం శంబా రెడ్డి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ఓదెల రైల్వే స్టేషన్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడని పోలీసులు చెప్పారు.
కరెంట్ షాక్తో చనిపోయి ఉంటే తమకు తెలియకుండానే మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లడం, మృతిపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, డెడ్ బాడీని పోస్టుమార్టానికి తరలించడం ఏంటని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిలదీశారు. ఈ ఘటనకు ఓదెలు రైల్వే స్టేషన్ పార్ట్-2 సినిమా డైరెక్టర్ అశోక్ కుమార్, ప్రొడ్యూసర్ ప్రశాంత్ సత్య బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.