ప్రియుడి మరణవార్త తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య

ప్రియుడి మరణవార్త తట్టుకోలేక ప్రియురాలి ఆత్మహత్య

హైదరాబాద్ : గచ్చిబౌలి నానక్ రామ్ గూడలో విషాదం జరిగింది. ప్రియుడి మరణవార్త విని ఓ ప్రియురాలి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి నానక్ రామ్ గూడలోని ఓ  హాస్టల్ లో ఉంటూ బరిష్టా కేఫ్ లో పని చేస్తోంది  నేహా(19) అనే యువతి. అదే కేఫ్ లో సహా ఉద్యోగి అయిన సల్మాన్ తో ప్రేమలో పడింది. అయితే.. వీరి ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో శనివారం రోజు బాలాపూర్ వెంకటాపురంలోని తన ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సల్మాన్. 

ప్రియుడు సల్మాన్ మృతిని తట్టుకోలేక ఇవాళ (అక్టోబర్ 3న) ఉదయం తాను ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్య  చేసుకుంది నేహా. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. నేహా సోదరి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నేహా డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.