సికింద్రాబాద్, వెలుగు : భార్య పుట్టింటికి వెళ్లి రావట్లేదని మనస్తాపానికి గురైన భర్త రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పాత పంచాయతీ ఆఫీసు దగ్గరలో ఉండే ధాత్రిక నర్సింహ(54) ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మద్యానికి బానిసై రోజూ తాగొచ్చి భార్య సుమలతను వేధించేవాడు.
తాగుడు మానేయాలని ఎన్నిసార్లు చెప్పినా అతడు వినకపోవడంతో సుమలత ఇద్దరు పిల్లలను తీసుకుని మూడేండ్ల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి తన ఇంటికి తీసుకువచ్చేందుకు నర్సింహ ఎన్నివిధాలుగా ప్రయత్నించినా సుమలత నిరాకరించింది. మనస్తాపానికి గురైన నర్సింహబుధవారం మేడ్చల్– మనోహరాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. రైల్వే ట్రాక్ పై డెడ్ బాడీ ఉందన్న సమాచారంతో జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించి.. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఉప్పల్‌లో భర్త వేధింపులతో భార్య సూసైడ్
ఉప్పల్ : భర్త వేధింపులు భరించలేక భార్య సూసైడ్ చేసుకున్న ఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ప్రేమ్‌కుమార్ ఉపాధి కోసం భార్య మౌనిక (21), కొడుకుతో కలిసి సిటీకి వచ్చాడు. ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో ఉంటూ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన ప్రేమ్‌కుమార్ రోజూ తాగొచ్చి భార్యను వేధించేవాడు. మంగళవారం అర్ధరాత్రి మరోసారి తాగి వచ్చిన ప్రేమ్ కుమార్ భార్యతో గొడవపడి కొట్టాడు. మనోవేదనకు గురైన మౌనిక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని గాంధీకి తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.