చండీగఢ్: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మాల్‌లో టాయ్ ట్రెయిన్ బోల్తా పడి పదేండ్ల బాలుడు మృతి చెందాడు. పంజాబ్‌లోని నవాన్‌షహర్‌లో గల బాలాచౌర్‌కు చెందిన బాలుడి కుటుంబం కాలక్షేపం కోసం శనివారం రాత్రి అక్కడికి దగ్గర్లోని ఎలాంటే మాల్ కు వెళ్లారు. అక్కడ బాలుడు ట్రాయ్ట్రెయిన్ ఎక్కి చివరి కంపార్ట్‌మెంట్‌లో కూర్చున్నాడు. మలుపు తిరుగుతున్న సమయంలో ట్రెయిన్ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ బాలుడిని సెక్టార్ 32లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ బాలుడు మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మాల్‌కు చేరుకొని టాయ్ ట్రెయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రైలు నడిపిన వ్యక్తితో పాటు మాల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.