బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకుంది. పీయూసీ- ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని అఘాయిత్యానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన దీపిక బాత్రూంకు వెళ్లి తిరిగి ఎంత సేపైనా తిరిగి రాలేదు. అనుమానం వచ్చి తోటి స్నేహితులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు డోర్లు బద్ధలు కొట్టి చూసేసరికి ఆమె చున్నీతో ఉరేసుకుని అపస్మారక స్థితిలో కనిపించింది.
తొలుత క్యాంపస్ హెల్త్ సెంటర్లో ప్రథమ చికిత్స అందించి.. అనంతరం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలిచారు. అక్కడ చికిత్స పొందుతూ దీపిక కన్నుమూసింది. ఆమె మృతి పట్ల ఆర్జీయూకేటీ బాసర అధికారులు, సిబ్బంది.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. దీపిక ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీపిక ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.