
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్కుమార్ (87) శుక్రవారం ( ఏప్రిల్ 4) తెల్లవారుజామున 4గంటలకు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన అందించిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2015లో దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డుతో సత్కరించింది.
బాలీవుడ్ ఇండస్ట్రీ భారత్ కుమార్ అనే ముద్దుగా పిలుచుకునే మనోజ్ కుమార్ అనేక మరపురాని దేశభక్తి పాత్రలను పోషించి మెప్పించారు. చిత్రనిర్మాతగా అనేక ప్రతిష్టాత్మక అవార్డులతో గుర్తింపు పొందారు. మనోజ్ కుమార్ అవార్డులు కేవలం ట్రోఫీలు మాత్రమే కాదు కథ చెప్పే కళకు అంకితమైన జీవితానికి నిదర్శనం. 'షాహీద్,' 'పురబ్ ఔర్ పశ్చిమ్,' 'క్రాంతి' వంటి దేశభక్తి ,సామాజిక న్యాయం శక్తివంతమైన సందేశాలతో తీసిన చిత్రాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం.
మనోజ్ కుమార్ దర్శకత్వం వహించిన 'ఉప్కార్' చిత్రంతో మనోజ్ కుమార్ దేశభక్తి చిత్రాలకు ఐకాన్ గా నిలిచారు. 1967లో ఈ సినిమా ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకుంది. ఈ బెస్ట్ ఫిలి చిత్రనిర్మాతగా మనోజ్ కుమార్ ఖ్యాతిని పెంచింది. 1992లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కరారం పద్మశ్రీ మనోజ్ కుమార్ ను వరించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు ప్రదానం చేశారు.
2015లో సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో మనోజ్ కుమార్ ను భారత ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డు దేశభక్తి ,సామాజిక విలువలతో పాతుకుపోయిన చిత్రాలతో భారతీయ సినిమాను సుసంపన్నం చేసిన ఆయన జీవితకాల కృషిని గుర్తు చేస్తుంది.