
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో విషాదం చోటు చేసుకుంది. కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన దగ్గర మహరాష్ట్ర వైపు గోదావరి నదిలో స్నానం చేస్తుండగా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరి కోసం పోలీసులు, జాలర్లు ఎస్టీఆర్ఎఫ్ బృందం గాలించగా..యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
మహారాష్ట్ర అసరెళ్లి గ్రామానికి చెందిన సుమంత్ (14), నాగ్ పూర్ కు చెందిన హేమాన్ష్ (24)తో పాటు మరో ముగ్గురు యువకులు కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన దగ్గర మహరాష్ట్ర వైపు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. అయితే వరద భారీగా రావడంతో సుమంత్ (14),హేమాన్ష్ గల్లంతయ్యారు. దీంతో సమాచారం అందుకున్న సిరోంచ పోలీసులు, స్థానిక జాలర్లు, ఎస్డీఆర్ ఎఫ్ బృందం సహయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. ఇద్దరు యువకులు విగతజీవులుగా లభ్యమయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దర్యాప్తు చేపట్టారు.