హైదరాబాద్ పుప్పాల గూడలో విషాదం.. అగ్నిప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి

హైదరాబాద్ పుప్పాల గూడలో విషాదం.. అగ్నిప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి

హైదరాబాద్: నార్సింగి PS పరిధిలోని పుప్పాల గూడలోని పాషా కాలనీలో కిరాణా దుకాణం యజమాని ఉస్మాన్‌ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు(ఫిబ్రవరి 28, 2025) సాయంత్రం 5:45 గంటలకు, గ్రౌండ్ ఫ్లోర్‌లోని కిరాణా షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో.. ఇల్లు మంటల్లో చిక్కుకుపోయింది. ఈ ఘటనలో 7 ఏళ్ల సిజిరా ఖాటూన్ అనే అమ్మాయి, 70 ఏళ్ల జమీలా ఖాతూన్, 40 ఏళ్ల సహానా ఖాతూన్.. ముగ్గురూ ఊపిరాడక చనిపోయారు. మరో ఐదుగురిని రక్షించారు. వీరిలో ఇద్దరికి ఫ్రాక్చర్ గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 3 సిలిండర్లు పేలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.

Also Read:-మీ పిల్లలు మళ్లీ UKG చదవాలి.. బెంగళూరు స్కూల్ యాజమాన్యం టూమచ్ బెదిరింపులు