మేడ్చల్: కండ్లకోయలోని హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో విద్యుత్ ఘాతం జరిగింది. కరెంట్ షాక్ కారణంగా ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కంపెనీలో ఇనుప నిచ్చెనను తమ బ్యారక్‌కు మార్చుతుండగా ప్రమాదవశాత్తూ మెయిన్ గేట్ సమీపంలోని విద్యుత్ తీగలు11 కెవికి తగిలాయి.ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, ఆరుగురు కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని CMR ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ALSO READ | బైక్ ను ఢీ కొట్టిన లారీ.. ఇద్దరు మృతి
చనిపోయిన ఇద్దరు కార్మికులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా మేడ్చల్ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన ఇద్దరి వివరాలను పోలీసులు వెల్లడించారు. బతుకుదెరువు వెతుక్కుంటూ నగరానికి వచ్చి కష్టం చేసుకుంటుంటే ఇలా దురదృష్టవశాత్తూ ప్రాణాలు పోవడంతో తోటి కార్మికులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటన జరిగిన కంపెనీలో విషాద వాతావరణం నెలకొంది.
చనిపోయిన ఇద్దరి వివరాలు:
1) గుడుబైటా S/O మిర్గా బైటా వయస్సు:26 సంవత్సరాలు (బీహార్)
2) పురో మాంఝీ, వయస్సు: 25 సంవత్సరాలు (బీహార్)