కరీంనగర్ జిల్లాలో విషాదం.. ఒకే ఫ్యాన్కు ఉరేసుకుని లవర్స్ సూసైడ్

కరీంనగర్ జిల్లాలో విషాదం.. ఒకే ఫ్యాన్కు ఉరేసుకుని లవర్స్ సూసైడ్

కరీంనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఫ్యాన్ కు ఉరేసుకుని లవర్స్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవలే ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయి.. తన ప్రియుడితో కలిసి సూసైడ్ చేసుకోవడం సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా వావిలాల పల్లిలో  అలేఖ్య, అరుణ్ అనే  ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల స్వస్థలం చొప్పదండిగా గుర్తించారు. అరుణ్ స్థానికంగా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ కరీంనగర్ లో రూమ్ తీసుకుని నివాసం ఉంటున్నాడు. 

అలేఖ్యకు ఇటీవలే పెళ్లి కుదిరందని, దీంతో ఇద్దరు బుధవారం (మార్చి5)  రాత్రి వావిలాలపల్లి ప్రశాంత్ నగర్ ఏరియాలోని గదిలో ఒకే ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వటంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. 

మరిన్ని వార్తలు