
అచ్చంపేట, వెలుగు: హైదరాబాద్ హుస్సేని ఆలం పోలీస్‌స్టేషన్‌లో గన్ మిస్ ఫైర్ కావడంతో ఏఆర్ ఏఎస్ఐగా పని చేస్తున్న పిట్టల బాలీశ్వరయ్య(48) చనిపోగా, ఆయన సొంత గ్రామమైన అచ్చంపేట మండలం లక్ష్మాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు రాములమ్మ , బాల్నారి కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామస్తులు, బంధువులు ఏఎస్ఐ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.