హైదరాబాద్ ఎల్బీ నగర్లో విషాదం.. పాపం ఈ అడ్డా కూలీలు.. పనికి పోతే ప్రాణాలే పోయినయ్..

హైదరాబాద్ ఎల్బీ నగర్లో విషాదం.. పాపం ఈ అడ్డా కూలీలు.. పనికి పోతే ప్రాణాలే పోయినయ్..

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని ఎల్బీ నగర్లో విషాదం చోటుచేసుకుంది. ఓ సెల్లార్ గుంత తీస్తుండగా గోడ కూలింది. అపార్ట్మెంట్ కోసం తీసిన సెల్లార్లో పిల్లర్స్ కోసం పనులు చేస్తుండగా ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు మృతి చెందగా పోలీసులు, ఫైర్ సిబ్బంది రెండు మృతదేహాలను బయటకు తీశారు. మృతి చెందిన వారు అంతా బంధువులే. మృతులు ఖమ్మం జిల్లా కొంజర్లకు చెందిన వీరయ్య, రాము(20), వాసు(21).పెద్ద అంబర్ పేట్ లో నివాసం ఉంటూ అడ్డా మీద కూలీలుగా పనికి వెళుతుండేవారు.

వీరిని అడ్డా మీద నుంచి తీసుకువచ్చి కాంట్రాక్టర్ పనులు చేపిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రోజూలానే పనికి వచ్చిన ఆ కూలీల బతుకులు ఇలా తెల్లారిపోవడంతో విషాదం నెలకొంది.