మేడారం(ఏటూరునాగారం), వెలుగు: ములుగు జిల్లాలో కొనసాగుతున్న మేడారం మహా జాతరలో విషాదం చోటుచేసుకుంది. గుండె పోటుకు గురై ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరుకు చెందిన చింతల కొమురయ్య (68) కుటుంబ సభ్యులతో కలిసి గురువారం జాతరకు వెళ్లాడు.
జాతరలోనే గుండెపోటుకు గురై చనిపోయాడు. అలాగే జంపన్నవాగులో స్నానం చేస్తుండగా కామారెడ్డికి చెందిన మరో భక్తుడు సాయిలు (52) తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు 108లో స్థానిక టీటీడీ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.