నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా నవీపేటలో విషాదం

  • వరుడి వేధింపులే కారణమని బంధువుల ఆరోపణ


నవీపేట్, వెలుగు : నిజామాబాద్​జిల్లా నవీపేట మండలంలో విషాదం నెలకొంది. కొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. మండల కేంద్రంలోని ర్యాగల్ల ప్రభాకర్ కూతురు రవళి(26)కి నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెండ్లి చేయాలని నిశ్చయించారు. స్థానిక ఫంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాలులో పెళ్లి జరగాల్సి ఉండగా, ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇంట్లో దూలానికి రవళి ఉరి వేసుకుంది.

గమనించిన యువతి తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెళ్లికొడుకు తరుచూ వేధిస్తుండటంతోనే రవళి సూసైడ్ చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. వధువుకు చివరిగా వచ్చిన ఫోన్ కాల్ వరుడిదేనని చెప్పారు. పెళ్లి ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినప్పటి నుంచి వరుడు ఆమెతో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడేవాడు. గత కొద్ది రోజులుగా అతని మాట తీరు మారిందని, కట్నం తక్కువైందని అంటున్నాడని వాపోయింది. 

అంతేకాదు ఉద్యోగం లేదని మానసికంగా హింసిస్తున్నాడని రవళి తమతో చెప్పిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అతని వేధింపులు తట్టుకోలేక సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుందని అంటున్నారు. పెళ్లి కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.