
పెంబి, వెలుగు: మీటర్బాక్స్లో ఫ్యూజ్ పెడుతూ కరెంట్షాక్తో యువకుడు చనిపోయిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. ఎస్ఐ హన్మాండ్లు తెలిపిన ప్రకారం.. పెంబి మండలం వేణునగర్ గ్రామానికి చెందిన ఆత్రం నాగోరావ్ (30) సోమవారం పొద్దున తన మొక్కజొన్న చేనుకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. మీటర్బాక్స్లో ఫ్యూజ్ పెడుతుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో కిందపడి పోయాడు కింద కూడా ఎర్తింగ్ఉండడంతో స్పాట్లోనే చనిపోయాడు. మృతుడికి భార్య సురేఖ, పదేండ్లలోపు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.