పట్టణ ప్రగతిలో విషాదం.. బాలిక మృతి

హన్మకొండ పట్టణ ప్రగతి కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. కొత్తూరు జెండా ప్రాంతంలో ప్రొక్లెయిన్‌తో క్లీన్ చేస్తుండగా గోడకు తగిలి.. గోడ పక్కనే ఉన్న ఇద్దరు పిల్లలపై పడింది. ఈ ఘటనలో  ప్రిన్సి అనే ఎనిమిదేళ్ల పాప చనిపోగా.. బాలిక  తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలిక మృతదేహాన్ని MGM‌ ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్ హాస్పిటల్‌కు వెళ్లి బాలిక మృతదేహాన్ని చూశారు. ఈ ఘటన చాలా విషాదకరమని ఆయన అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన తెలిపారు.