హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండలో జూన్ 8న చేప మందు పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. చేప మందు ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. భారీగా జనాలు అక్కడికి రావవడంతో తోపులాట జరిగింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ గ్రామానికి చెందిన రాజన్న (57) ఉదయం 7 గంటల నుంచి క్యూలైన్ లో నిలబడి ఉన్నాడు. రద్దీ పెరిగి క్యూలైన్ లో లోపులాట జరగడంతో స్పృహ తప్పి పడిపోయాడు.
వెంటనే స్థానికులు అతన్ని కేర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ రాజన్న మృతి చెందాడు. శనివారం ఉదయం 9గంటలకు ప్రారంభమైన చేప మందు పంపిణీ కార్యక్రమం.. 24గంటలపాటు సాగుతుంది. ఈ కార్య్రమాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.