పిడుగపాటుకు ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మే 19వ తేదీ ఆదివారం గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడి గ్రామానికి చెందిన మంగలి శ్రీనివాస్, కొన్నిటి లక్ష్మప్ప అనే ఇద్దరు వ్యక్తులు పొలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
కాగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా్ల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, ఈరోజు మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో చిరుజల్లులతో మొదలై.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది.