వరంగల్ జిల్లాలో విషాదం.. కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా..

వరంగల్ జిల్లాలో విషాదం.. కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా..

వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం (మార్చి 6) ఉదయం కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. చెన్నారావుపేట మండలం కోనాపురం శివారులో కూలీలతో ట్రక్కు బోల్తా పడటంతో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ  ప్రమాంలో పలువురికి గాయాలయ్యాయి.  ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. 

జీడిగడ్డతండా నుండి ఇటుకాలపల్లికి మిర్చి ఏరడానికి వెళుతుండగా ప్రమాదం చోటు చేసుందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో ట్రక్కులో 50 మంది కూలీలు ఉన్నారు. 30 మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.