
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం రాళ్లగూడ దొడ్డి ఇంద్రారెడ్డి కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై నుంచి ఆటో ట్రాలీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. నాగర్కర్నూల్జిల్లా మరికల్గ్రామానికి చెందిన శివశంకర్, రేణుక దంపతులకు కీర్తి అనే ఏడాదిన్నర కూతురు ఉంది. శుక్రవారం ఇంద్రారెడ్డి కాలనీలో శ్లాబ్ నిర్మాణ పనులకు వచ్చిన శివశంకర్, రేణుక పాపను కూడా తీసుకొచ్చారు.
ఇంటి ముందు వదిలి.. పనుల్లో నిమగ్నమయ్యారు. అదే టైంలో సిమెంట్లోడుతో వచ్చిన ఆటో ట్రాలీ పాపను తొక్కించుకుంటూ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. కండ్ల ముందే కూతురు చనిపోవడంతో తల్లితండ్రులు బోరున విలపించారు. ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.