ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే బిడ్డ మృతి

 ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే బిడ్డ మృతి

నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది.   వైద్యుల నిర్లక్ష్యంతో కడుపులోనే శిశువు మృతి చెందింది. లోకేశ్వరం మండలం నగర్ గ్రామానికి చెందిన రజిత పురిటి నొప్పులతో నవంబర్ 19వ తేదీన ఉదయం 11 గంటలకు  భైంసా ఆసుపత్రిలో చేరింది.

 నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పిన వైద్యులు సాయంత్రం వరకు వెయిట్ చేయాలని చెప్పారు.  చివరకు  రాత్రి 12గంటలకు నార్మల్ డెలివరీ చేయడంతో  శిశువు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బందితోనే చికిత్సలు చేసారని, ఇప్పటి వరకు ఒక్క డాక్టర్ కూడా రజితను పరిశీలించలేదని కుటుంబీకుల ఆరోపిస్తున్నారు.  

దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే శిశువు కడుపులోనే మృతి చెందిందని రజిత కుటుంబీకుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.