వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. కడుపులోనే బిడ్డ మృతి

ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం ఓ శిశువు ప్రాణం తీసింది. బాధిత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చెరువు మాదారానికి చెందిన లక్ష్మీ, కోటయ్య దంపతులు వ్యవసాయం చేస్తూ జీవించేవారు. లక్ష్మీ పురిటి నొప్పులతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చేరింది. తల్లి కడుపులో శిశువు మృతి చెందిన విషయం డాక్టర్లు చెప్పారు. అయితే శిశువును త్వరగా తీయకుండా డాక్టర్లు తల్లి ప్రాణాల మీదకి తీసుకువచ్చారని బంధువులు ఆరోపించారు. 

కొన్ని గంటల తరువాత ఆపరేషన్​ చేసి బిడ్డను బయటకి తీశారు. దీంతో తల్లికి ప్రాణాపాయం తప్పింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని.. తల్లి ప్రాణాలమీదకు వచ్చిందని బంధువులు ఆరోపిస్తూ వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో తరచూ ఇలాంటి ఘటనలు జరగడం విమర్శలకు తావిస్తోంది.