ఢిల్లీ సీన్ హైదరాబాద్‌లో రిపీట్ కాకూడదు.. అమీర్‌పేట్, దిల్‌షుక్‌నగర్, అశోక్‪నగర్.. బీ కేర్‌ఫుల్

ఢిల్లీలో రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లో జరిగిన విషాదం హైదరాబాద్‌లో రిపీట్ కాకూడదు. ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్ లో జూలై 28న సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్ మెంట్ లోకి వరదలు వచ్చి ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. ప్రమాద సమయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో పదుల సంఖ్యలో అభ్యర్థులు చదువుకుంటున్నారు. రోడ్డుపై చేరిన వరద నీరు కారణంగా బేస్మెంట్ గేట్లు విరిగిపోయి అందులోకి నీరు చేరింది.

జూలై 28న రాత్రంతా వారం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కమంటూ గడిపారు. రెస్క్యూ టీం ఎంత ప్రయత్నించినా ముగ్గరి ప్రాణాలు పోయాయి. అయితే అదే  తరహాలో హైదరాబాద్ లో అమీర్ పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, దిల్ షుక్ నగర్ లో కూడా భారీగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. 

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఎంతో మంది విద్యార్థులు హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఒక్కో క్లాస్ రూంలో వందల మంది కూర్చుంటారు. స్టడీ హాల్స్ కుప్పలు తెప్పలుగా వెలిశాయి. వాటికి అనుమతులు ఉన్నాయా? వాటిలో ఎన్ని బిల్డింగులకు ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు ఉన్నాయి. విపత్కర పరిస్థితుల్లో బయపడేందుకు కోచింగ్ సెంటర్లు సేఫ్టీ ప్రికాషన్లు పాటిస్తున్నాయా? GHMC అధికారులు అప్పుడప్పుడు సోదాలు చేస్తున్నారు.

జరగరాంది ఏమైనా జరిగితే నష్టం భారీగా ఉంటుంది. ఇప్పటికైనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కోచింగ్ సెంటర్లపై దృష్టి పెట్టాలి. ఆ బిల్డింగుల సామర్థ్యం ఎంత.. ఎంతమంది విద్యార్థులు అక్కడ ఉన్నారని ఆరా తీయాయి. సేఫ్టీ రూల్స్ పాటించని కోచింగ్ సెంటర్లపై యాక్షన్ తీసుకోవాలి. ఇన్ స్టిట్యూట్లు నడిపిస్తున్న సంస్థల పర్మిషన్లు చెక్ చేయాలని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.