
- మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం-1ఏ గనిలో ఘటన
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం-1ఏ గనిలో డ్యూటీ చేస్తూ జనరల్మజ్దూర్ కార్మికుడు పచ్చునూరి రాంచందర్(32) చనిపోయాడు. ఉదయం మొదటి షిఫ్ట్‌లో భాగంగా మ్యాన్ రైడింగ్ ఆపరేటర్‌గా రాంచందర్ గనిలోని మూడో డిప్, జీరో లెవల్ వద్ద ఉన్న రెండో మ్యాన్ రైడింగ్ వద్ద పని చేస్తున్నాడు. కొద్ది సేపటి తరువాత రాంచందర్పని చేస్తున్న స్థలంలోనే కూప్పకూలాడు. తోటి కార్మికులు, ఆఫీసర్లు మొదట ఆర్కే-8 డిస్పెన్సరీ, ఆ తరువాత రామకృష్ణాపూర్సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాంచందర్ చనిపోయాడని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత మృతికి కారణాలు తెలుస్తాయని సింగరేణి డాక్టర్లు తెలిపారు.
మృతుడి నుదిటిపై గాయమై రక్తస్రావం జరిగిందని తోటి కార్మికులు చెప్పారు. మృతుడు పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌కు చెందినవాడు. రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రిలో రాంచందర్ డెడ్‌బాడీని కార్మిక సంఘాల లీడర్లు, శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్, ఇందారం-1ఏ గని, ఓసీపీ పీవో ఏవీ రెడ్డి సందర్శించి నివాళులు అర్పించి, మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
రాంచందర్ మృతిని మైన్ యాక్సిడెంట్‌గా పరిగణించాలని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ లీడర్ ఎండీ.అక్బర్అలీ, బాజీసైదా, టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ పెట్టెం లక్ష్మణ్, హెచ్ఎంఎస్వైస్ప్రెసిడెంట్తిప్పారపు సారయ్య, అనిల్‌రెడ్డి, సీఐటీయూ ప్రెసిడెంట్బాలాజీ డిమాండ్ చేశారు. అన్ని రకాల బెనిఫిట్స్, రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి డిపెండెంట్ జాబ్ఇవ్వాలని కోరారు.