జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని గ్యాస్ లీక్ చేసుకొని పిట్టల జ్యోష్ణ అనే వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్యాస్ స్టవ్ కు నిప్పు అంటుకోవడంతో ఒక్కసారిగా అది పేలింది. ఈ ఘటనతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
ఈ ఘటనలో జ్యోష్ణ మంటల్లో కాలిపోయింది. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. జ్యోష్ణను కాపాడడానికి వెళ్లిన ఒక వృద్ధురాలితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.