అల్వాల్ లో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

హైదరాబాద్ : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థి అనుమానాస్పద మృతి కేసు కలకలం రేపుతోంది. మచ్చ బొల్లారంలో అఖిలేష్ అనే విద్యార్థి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. అయితే.. ఉన్నట్టుండి అతడు అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ స్కూలు యాజమాన్యం, ప్రిన్సిపల్ వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అఖిలేష్ సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకున్నాడు.

విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. అఖిలేష్ రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అఖిలేష్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని..అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. అఖిలేష్ డెడ్ బాడీని సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు.  విద్యార్థి మరణానికి దారి తీసిన కారణాలను పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.