చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. అందరూ చూస్తుండగా హత్య

హైదరాబాద్ : చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజంపురా డివిజన్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. హత్య చేసిన తర్వాత నిందితుడు ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఆజంపురాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు యూసఫ్(30) అనే వ్యక్తి.. అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో బైక్ తో వెళ్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత భర్త, ఆమె బంధువులు బైక్ లపై వారిని వెంబడించారు. యూసఫ్ ను కత్తులతో హత్య చేసి పారిపోయారు. హత్య చేసిన తర్వాత నిందితులు చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు తెలుస్తోంది. 

ALSO READ:తర్వాత ఏమైందీ : 110 స్పీడ్ తో వెళ్తున్న రైలు నుంచి జారి పడ్డాడు..

విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మరోవైపు.. సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ మనోహర్ క్లూస్ టీమ్ తో ఘటనాస్థలాన్ని పరిశీలించి, పూర్తి వివరాలు సేకరించారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు యూసఫ్ కు సదరు మహిళతో వివాహేతర సంబంధం ఉండటం వల్లే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.